News March 22, 2025
విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యం

నాయుడుపేట వద్ద సాంకేతిక లోపంతో మెమో ట్రైన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దాని వెనుక వస్తున్న ట్రైన్స్ అన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘమిత్ర, హైదరాబాద్, సర్కార్, జైపూర్, బిట్రగుంట ఎక్స్ప్రెస్స్, ఛార్మినార్, గ్రాండ్ ట్రంక్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్స్ రీ ఓపెన్.. కానీ కండిషన్స్ అప్లై!

తుఫాన్ ప్రభావం లేని, పునరావాస కేంద్రాలుగా ఉపయోగించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ నెల 30వ తేదీ నుంచి రీఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. అయితే, పాఠశాల భవనాలు సురక్షితమని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే తెరవాలని సూచించారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో, తరగతి గదుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌ను కలెక్టర్ ఆదేశించారు.
News October 29, 2025
తుఫాను ప్రభావిత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలి: కలెక్టర్

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సహాయం పంపిణీ, తుఫాను నష్ట గణనపై అధికారులతో చర్చించారు.
News October 29, 2025
అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.


