News January 2, 2025
విజయవాడ: వైసీపీ నేతకు సుప్రీంలో ఊరట
వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.
Similar News
News January 8, 2025
మచిలీపట్నంలో దారుణ హత్య
మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 8, 2025
’12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ’
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుదల చేసినట్లు తెలిపారు.
News January 7, 2025
MTM: వసతి గృహంలో కలెక్టర్ పుట్టిన రోజు వేడుకలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థినుల సమక్షంలో తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మచిలీపట్నం బచ్చుపేటలోని వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్లతో కూడిన కిట్స్ను అందజేశారు.