News December 11, 2024
విజయవాడ: వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డికి షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733898602708_51824121-normal-WIFI.webp)
తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత పూనురు గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి హత్యకు గౌతమ్ రెడ్డి కుట్ర పన్నారని, ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్, ఫోటోలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ కేసు వాదనలో భాగంగా గతంలోనే న్యాయస్థానానికి విన్నవించారు.
Similar News
News January 15, 2025
విజయవాడ: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736868062733_51824121-normal-WIFI.webp)
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08533 VSKP- SC, నం.08537 VSKP- SC రైళ్లను బుధవారం నడుపుతామని, ఈ రైళ్లలో 9 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయన్నారు. నేడు నం.08533 రైలు మధ్యాహ్నం 3.30కి, నం.08537 రైలు రాత్రి 11.30కి విజయవాడ చేరుకుంటాయన్నారు.
News January 15, 2025
రూ.255 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాం: సుజనా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736851508364_51824121-normal-WIFI.webp)
అమరావతి రైతులకు పెండింగ్ కౌలు నగదు విడుదల చేసిన NDA కూటమి ప్రభుత్వం వారింట సంతోషాలు నింపిందని విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు. జగన్ హయాంలో పెండింగ్‌లో ఉంచిన కౌలు నగదు ఒకేసారి రూ.255 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి న్యాయం చేయటం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం అని సుజనా స్పష్టం చేశారు.
News January 14, 2025
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న థమన్, బాబీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736864704361_51824121-normal-WIFI.webp)
“డాకుమహారాజ్” చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు థమన్ మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బాబీతో కలసి అమ్మవారిని దర్శించుకున్నానని థమన్ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. కాగా 2025 సంక్రాంతికి వీరిద్దరూ పనిచేసిన “డాకుమహారాజ్” థియేటర్లలో సందడి చేస్తోంది.