News October 10, 2024

విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండగల సీజన్‌లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-విజయవాడ స్పెషల్ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం నుంచి ఈనెల 10 నుంచి 18 వరకు(14 మినహా) నడుస్తుందన్నారు.

Similar News

News November 5, 2024

విశాఖ: 734 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీచర్ పోస్టులు అన్ని కేటగిరీల్లో కలిపి 734 ఖాళీలు ఉన్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటిలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలల్లో 625, మున్సిపల్‌ పాఠశాలల్లో 109 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ-తెలుగు) ఖాళీలు 205, ఉర్దూ 11 ఖాళీలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలను తాజా నివేదికలో పొందుపరచలేదు.

News November 5, 2024

మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు: చంద్రబాబు

image

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News November 5, 2024

పెందుర్తి: భూములు వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు

image

విశాఖ శారదా పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను విశాఖ కలెక్టర్‌కు పంపించారు. 2021లో కేటాయించిన రూ.225 కోట్ల విలువచేసే 15 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.