News February 22, 2025
విజయవాడ: శ్రీశైలంలో పర్యటించనున్న గవర్నర్

ఈనెల 24న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీశైలం వెళ్లనున్నట్లు విజయవాడలోని ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ దంపతులు 24న సాయంత్రం విజయవాడ నుంచి హెలికాఫ్టర్లో సున్నిపెంట వెళతారని, అనంతరం రాత్రి 8.45కి స్వామివారి దర్శనం ముగించుకుంటారని పేర్కొంది. 25వ తేదీ ఉదయం 11.20కి వారు విజయవాడ చేరుకుంటారని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
Similar News
News December 8, 2025
ఏలూరు: PGRSకు 363 ఫిర్యాదులు- JC

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో మొత్తం 363 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సోమవారం తెలిపారు. ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని JC సూచించారు.
News December 8, 2025
భద్రాచలం: అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలి: ఎస్పీ

భద్రాచలం బ్రిడ్జి వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలైన్స్ టీం) చెక్ పోస్ట్ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.
News December 8, 2025
రాయికల్: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూములకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.


