News July 12, 2024
విజయవాడ సీసీగా బుచ్చి వాసి

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఎస్వీ రాజశేఖర బాబు నియమితులయ్యారు. ఆయన 1998లో గ్రూప్-1 అధికారిగా పోలీస్ శాఖలో ప్రవేశించి, 2006లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. తిరుపతి, అనంతపురం, గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐజీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా పోస్టింగ్ పొంది ఇప్పుడు విజయవాడకు సీపీ అయ్యారు.
Similar News
News July 6, 2025
నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.
News July 5, 2025
రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.
News July 5, 2025
నెల్లూరు: చిన్నారుల కోరిక.. స్పందించిన లోకేశ్

నెల్లూరు VR స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తామూ చదువుకుంటామని కమిషనర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా స్పందించారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. ‘పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధనం విద్య. చిన్నారులు కలలను సాకారం చేసుకునేందుకు అన్ని విధాల అండగా నిలుస్తాం’ అని ఆయన వెల్లడించారు.