News February 22, 2025
విజయవాడ: స్పా సెంటర్లపై పోలీసుల దాడి

విజయవాడలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన సమాచారం ప్రకారం.. గుణదలలో బ్యూటీ పార్లర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామని చెప్పారు. ఈ దాడిలో 10 మంది మహిళలను 10 మంది విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆర్గనైజర్ రత్న కిషోర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శనివారం తెలిపారు.
Similar News
News November 17, 2025
అరకు: వణికిస్తున్న చలి పులి

ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం భానుడు ఉదయించినా పొగ మంచు తొలగిపోవడం లేదు. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు ధరిస్తూ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్‌జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ACB కేసులు ఉన్నవారు ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖా సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది.