News August 23, 2024

విజయవాడ: హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

image

హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. గుణదలలో అరుణ్ కుమార్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారన్నారు. ఈ ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నమని చెప్పారు. విద్యాధర్, సుంకర చందు, అరుణ్, గణేశ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News January 23, 2026

కృష్ణా: జెడ్పీలో 25 మందికి పదోన్నతులు

image

జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 25 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు పదోన్నతి కల్పించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన వారికి జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. జెడ్పీ హైస్కూల్స్‌లో 20 మంది, ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఐదుగురు టైపిస్ట్‌లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆమె తెలిపారు.

News January 23, 2026

కృష్ణా: ‘త్వరలోనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు’

image

కృష్ణా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరప్రసాద్ తెలిపారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నుంచి తొమ్మిది మంది, కలెక్టర్ నామినేట్ నుంచి ముగ్గురు జర్నలిస్ట్‌లు మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటైందన్నారు. త్వరలోనే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామన్నారు.

News January 23, 2026

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని, దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకున్న నాడే సమసమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులచే ‘నా దేశం-నా ఓటు’ నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు.