News January 28, 2025
విజయవాడ: ‘1.10లక్షల మందికి రుణాలే లక్ష్యం’

సూర్య ఘర్ పథకం కింద లబ్దిదారులకు రుణాల మంజూరుపై సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్య ఘర్ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్యానెల్‌ను అమర్చి జిల్లాను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు.
Similar News
News November 21, 2025
కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్‌మెన్‌గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News November 21, 2025
7337359375 నంబర్‌కు HI అని పంపితే..

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.
News November 21, 2025
HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాలి: సీపీ

నగరంలో ట్రాఫిక్ విభాగం పనితీరు రోజురోజుకు మెరుగుపడుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆయన ట్రాఫిక్ విభాగంపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రంక్& డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. HYD పోలీసులు మల్టీ ప్లేయర్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


