News January 28, 2025

విజయవాడ: ‘1.10లక్షల మందికి రుణాలే లక్ష్యం’

image

సూర్య ఘర్‌ పథకం కింద లబ్దిదారులకు రుణాల మంజూరుపై సోమవారం కలెక్టర్‌ లక్ష్మీశ విజయవాడ కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. సూర్య ఘర్‌ పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల ఇళ్లకు సోలార్‌ విద్యుత్‌ ప్యానెల్‌ను అమర్చి జిల్లాను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. 

Similar News

News February 12, 2025

బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి

image

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.

News February 12, 2025

సర్కారు బడిలో సార్ బిడ్డ..!

image

సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

News February 12, 2025

వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

image

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

error: Content is protected !!