News December 28, 2024

విజయవాడ: 1400 మంది యువతకు ఉద్యోగాలు

image

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమానికి సుమారు 5000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ జాబ్ మేళాలో 1400 మంది నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అనంతరం ఉద్యోగం సాధించిన యువతకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 4, 2025

కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం.ఫార్మసీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

News January 3, 2025

విజయవాడ: కంపెనీలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఆర్టీసీ బస్సు ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం VJA నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న RTC మెట్రో బస్సు అదుపుతప్పి ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించారు. ఈ క్రమంలో హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది. 