News November 2, 2024
విజయవాడ: APCRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విజయవాడలోని APCRDA కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS&రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్&సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలకై https://crda.ap.gov.in/Careers/General చూడవచ్చు.
Similar News
News December 8, 2024
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..APSSDC ద్వారా ఉచిత శిక్షణ
కృష్ణా: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకై APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. BSC నర్సింగ్, మిడ్‌వైఫరీ(GNM), జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 10లోపు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి 6 నెలల శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు APSSDC కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.
News December 8, 2024
మైలవరం: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థినిని వెంటనే ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతోంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 8, 2024
ఎన్టీఆర్ జిల్లా: పురుగుల మందు తాగి యువతి సూసైడ్
పురుగుల మందు తాగి యువతి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో జరిగింది. గోళ్ల గోపాలరావు, నాగమణి దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి(17) కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.