News April 24, 2024
విజయసాయిరెడ్డిపై 21 కేసులు
➤ నియోజకవర్గం: నెల్లూరు ఎంపీ
➤ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR)
➤ VSR ఆస్తి: రూ.66.73 కోట్లు
➤ భార్య ఆస్తి: రూ.13.99 కోట్లు
➤ అప్పులు: రూ.10.34 లక్షలు,
➤ భార్య అప్పులు రూ.22.84 లక్షలు
➤ వాహనాలు: ఒకే కారు
➤ బంగారం: 1456 గ్రాములు
➤ డైమండ్లు: 345.07 క్యారెట్లు
NOTE: తనపై సీబీఐతో పాటు మొత్తం 21 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి: కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆయన కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
News February 5, 2025
రామయ్యపట్నం గురించి రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ బీద
రామయ్యపట్నం లో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో మంగళవారం ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ ప్రాజెక్టు వ్యయం 96,862 కోట్ల రూపాయలని, ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 6000 ఎకరాల భూమిలో నెల్లూరు జిల్లా రామయ్యపట్నం ఓడరేవులు గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు అంగీకరించబడింది తెలిపారు
News February 5, 2025
నెల్లూరు యువకుడికి సీఎం చంద్రబాబు ప్రశంస
ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మెరిసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్లో కాంస్యం సాధించిన కర్రి సాయి పవన్ (రాజమండ్రి), షేక్ గౌస్ (నెల్లూరు), కానోస్లాలోమ్ C1 మహిళల విభాగంలో కాంస్యం సాధించిన దొడ్డి చేతన భగవతికి (ఏలూరు) ఆయన అభినందనలు తెలిపారు. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని CM సంతోషం వ్యక్తం చేశారు.