News November 27, 2024
విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: ములుగు కలెక్టర్
ప్రజా పాలన, విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, విజయయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈనెల 29న స్థానిక డిఎల్ఆర్ గార్డెన్‌లో విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.
Similar News
News December 4, 2024
ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం?
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఆగస్టు 31న ఇదే ప్రాంతంలోని మేడారం అడవుల్లో లక్షల సంఖ్యలో భారీ చెట్లు నేలకొరిగాయి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే భారీ వృక్షాలు టోర్నడో తరహాలో విరిగి పడగా, వాటిపై ఇంకా అటవీశాఖ అధికారుల పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది.
News December 4, 2024
ములుగు: భార్య జైలులో.. భర్త ఎన్‌కౌంటర్లో మృతి
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఒకరైన ముసాకి దేవల్@ కరుణాకర్ ఐదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లాడని తండ్రి బుజ్జ తెలిపారు. భార్య రీత కూడా దళసభ్యురాలు కావడం గమనార్హం. కాగా, ఏడాదిక్రితం చర్ల వద్ద రీతను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం ఖమ్మంలో జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి బుజ్జ మాటవినకుండా అడవిలోకి పోయి, ఎన్‌కౌంటర్ర్లో చనిపోయినట్లు తెలిపాడు.
News December 4, 2024
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీతక్క
ఈనెల 5న ప్రారంభం కానున్న ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి మంత్రి సీతక్క ఆహ్వానం అందజేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళా శక్తి పథకంలో కీలక మలుపు అని, ఆర్థిక స్వావలంబన దిశగా శ్రీకారం అని మంత్రి సీతక్క చెప్పారు.