News February 15, 2025

‘విజయ తెలంగాణ’ రాసింది మన మేడ్చల్ మాజీ MLA

image

మేడ్చల్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే తూళ్ల దేవేందర్ గౌడ్ ‘విజయ తెలంగాణ’ పేరుతో పుస్తకం రాశారు. శుక్రవారం స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే నాయకుల్లో దేవేందర్ గౌడ్ అగ్రస్థానంలో ఉంటారని కీర్తించారు.‘విజయ తెలంగాణ ఆయన స్వీయ చరిత్ర కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం’ అని అన్నారు.

Similar News

News November 27, 2025

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

image

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు తీసుకున్నామని మన్యం కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. వివిధ అంశాలపై రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టలు ఉన్నాయని, గోనె సంచులు ఆర్ఎస్‌కేలలో సిద్ధంగా ఉంచామన్నారు.

News November 27, 2025

సిద్దిపేట: రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఐడీఓసీ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ హైమావతి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 508 గ్రామపంచాయితీలకు, 4508 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, 27 నవంబర్ గురువారం మొదటి విడత నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు.

News November 27, 2025

కృష్ణా: త్వరలో సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టుల భర్తీ

image

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.