News May 19, 2024

విజిలెన్స్ ఎంక్వయిరీని ఆహ్వానించిన కేయూ వీసీ

image

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వేసిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నానని తెలిపారు. తాను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా నిబద్ధతగా పనిచేశానన్నారు.

Similar News

News December 14, 2024

కొమరవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 73 రోజుల్లో రూ.81,68,044 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 550 కేజీలు వచ్చాయన్నారు.  

News December 13, 2024

గ్రూప్-II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: WGL సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ జిల్లా పరిధిలో రేపు డిసెంబర్ 15 నుంచి 16 వరకు జరిగే TGPSC గ్రూప్-II నిర్వహించే పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీ నిషేధమని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఓ ప్రకటనలో తెలిపారు.

News December 13, 2024

వరంగల్ కాకతీయ జూ-పార్కుపై ప్రత్యేక దృష్ట

image

కాకతీయ జూ-పార్కు మధ్య గుండా పోతున్న వరదనీటి డ్రైనేజీ కారణంగా దుర్వాసన వస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, డ్రైనేజీని జూ-పార్కు బయటకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అదేశించారు. రివ్యూ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ జూ పార్కుతో పాటు ఇతర జూ పార్కుల్లో ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.