News September 4, 2024
విజృంభిస్తున్న డెంగ్యూ.. పట్టించుకోని ప్రభుత్వం: హరీశ్ రావు

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో లోపంతో డెంగ్యూ జ్వరాలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తడకపల్లి గ్రామానికి చెందిన కనకలక్ష్మి డెంగ్యూ జ్వరంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు అందక, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం భూమి అమ్ముకొని రూ.25 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం కాపాడుకోలేక పోయారని అన్నారు.
Similar News
News February 24, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని 28 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉ. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 24, 2026
మెదక్: ‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని సీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా విద్యా, పోలీస్, ఆర్టీసీ, వైద్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.


