News January 30, 2025
విజ్ఞాన శాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా బోధించాలి:జిల్లా కలెక్టర్

విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆచరణాత్మక విధానం ద్వారా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని.. బాగా గుర్తు ఉండిపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ అందజేశారు. ఈ కిట్లను టీచర్లు సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ప్రయోగాత్మక విధానంలో బోధించాలన్నారు.
Similar News
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 13, 2025
మరీ కాకతీయ సంగతేందీ..?

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై కామెంట్?
News December 13, 2025
WGL: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తత్కాల్ అవకాశం

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ 2025-26 విద్యాసంవత్సర ప్రవేశాలకు తత్కాల్ స్కీం కింద మరోసారి అవకాశం కల్పించినట్లు HNK డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఉమ్మడి WGL జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం తెలిపారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.TOSS వెబ్సైట్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, డాక్యుమెంట్లు సంబంధిత అక్రిడిటెడ్ విద్యాసంస్థల్లో సమర్పించాలని సూచించారు.


