News December 6, 2024

విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.

Similar News

News February 22, 2026

గుంటూరు: బ్యాంకులో నగలు మాయం..!

image

తుళ్లూరు(M) వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంక్‌లో బంగారు నగలు మాయమయ్యాయి. ఎస్సై కలగయ్య కథనం మేరకు.. ఈనెల 2న సేఫ్ లాకర్‌లో ఉంచిన 2 పౌచ్‌లలోని 328 గ్రాముల నగలు కనిపించడం లేదు. ప్రాథమిక అంతర్గత తనిఖీ, CCTV పరిశీలనలో అదే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి సంధ్యారాణి అనుమతి లేకుండా తాళం చెవి తీసుకుని లాకర్ నుంచి పౌచ్‌లు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.