News October 27, 2024
విడపనకల్: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని హవళిగి గ్రామానికి చెందిన వరలక్ష్మి, పెన్నయ్య దంపతులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో వరలక్ష్మి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News February 23, 2026
సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.