News June 22, 2024
విడవలూరు: కిడ్నాపర్ ని పట్టుకున్న గ్రామస్థులు

విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని విచారించగా తనది తమిళనాడు అని, అక్కడినుంచి వచ్చి ఓ గ్రామానికి చెందిన ఓ పాపను కిడ్నాప్ చేశానని… తనను పోలీసులు తరమడంతో ఆ పాపను వ్యాన్ లో వదిలేసి అక్కడకు వచ్చినట్లు తెలిపాడు. అతనిని గ్రామస్థులు పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.


