News June 14, 2024
విత్తనాలు నాటేందుకు రైతుల ఎదురు చూపు

ఖమ్మం జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగవుతోంది. అయితే, 60 మి.మీ. కనీస వర్షపాతం నమోదైతేనే విత్తనాలు విత్తేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ మేరకు వర్షం కురవలేదు. ఈ ఏడాది జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 24,313 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు నాటగా.. పూర్తిస్థాయిలో వర్షం కురిస్తేనే మిగతా రైతులు నాటే అవకాశముంది.
Similar News
News December 1, 2025
కామేపల్లిలో రెండో రోజు 169 నామినేషన్లు దాఖలు

కామేపల్లి మండలంలో రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 39, వార్డు స్థానాలకు 130 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో జి. రవీందర్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మండలంలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 49, వార్డు స్థానాలకు 142 దరఖాస్తులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతున్నట్లు, లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
News December 1, 2025
పేదలకు వరం.. ఖమ్మం జీజీహెచ్లో పేస్మేకర్ సర్జరీ

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పేద ప్రజలకు భారీ ఖర్చుతో కూడిన పేస్మేకర్ సర్జరీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గుండె కొట్టుకునే వేగం తగ్గిన తిరుమలాయపాలెంకు చెందిన 67ఏళ్ల దామెర వెంకన్నకు డాక్టర్ సీతారాం, డాక్టర్ జియా నేతృత్వంలోని వైద్య బృందం నవంబర్ 30న శాశ్వత పేస్మేకర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ఈ వైద్య బృందాన్ని అభినందించారు.
News December 1, 2025
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

ఫేజ్-2 మండలాల స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీజ ఈరోజు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో అన్ని విధానాలు జాగ్రత్తగా అమలవుతున్నాయని ఆమె నిర్ధారించుకున్నారు. అనంతరం డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రోజువారీ రిపోర్టింగ్ ప్రక్రియలను ధృవీకరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.


