News February 27, 2026

విదేశాలకు అనంతపురం ‘ఎర్రబంగారం’

image

అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్ పెరుగుతోంది. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఈ మిర్చి ఎగుమతి అవుతోంది. నాణ్యమైన ఘాటు, రంగు కారణంగా విదేశీ కంపెనీలు రైతులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల రైతులకు స్థిర ఆదాయం లభిస్తోంది. కంపెనీలు మొక్క దశ నుంచి రసాయన వినియోగాన్ని పర్యవేక్షిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నాయి.

Similar News

News April 13, 2026

నెక్కొండ: 470కి 467 మార్కులు సాధించిన తేజస్వి

image

నెక్కొండ టీజీఆర్‌జేసీకి చెందిన తేజస్వి ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 470కి 467 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన ఆమె తండ్రి అశోక్ కుమార్, తల్లి మమత కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తేజస్వి కష్టపడి ఈ ఫలితాన్ని సాధించింది. భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తానని తెలిపింది.

News April 13, 2026

భద్రాద్రి: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 63.49%, ద్వితీయ సంవత్సరంలో 77.71% ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్‌ విభాగంలో 78.19% ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News April 13, 2026

అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

image

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.