News February 18, 2025

విదేశాలకు వెళ్లే వారి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు: కలెక్టర్

image

ఉద్యోగాలు, ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారికి అండగా నిలిచేందుకు అమలాపురం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో విదేశాలకు వెళ్లాలనుకునేవారు, వెళ్లి మోసపోయిన వారు, ఏజెంట్లతో గల్ఫ్ ఉద్యోగాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఏజెంట్లు మోసాలకు చెక్కు పెట్టేందుకే దీన్ని ఏర్పాటు చేసామన్నారు.

Similar News

News March 12, 2025

జగిత్యాల: ఈనెల 15న జాబ్‌మేళా

image

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈ నెల 15న జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయిన ఉపాధి కల్పనాధికారి సత్యమ్మ తెలిపారు. సర్వీస్ సలహాదారుడు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్, టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయని డిగ్రీ, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10:30 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

News March 12, 2025

రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.

News March 12, 2025

ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వండి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరిని సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 30 లోపు సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు.

error: Content is protected !!