News March 11, 2025

విదేశాలకు వెళ్లే వారి కోసమే హెల్ప్ డెస్క్ ఏర్పాటు: కలెక్టర్

image

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వలస వెళ్లే తమ కుటుంబాలను పోషించుకోవలసిన వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన సేవలందించేందుకు అమలాపురం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ జిల్లా ఎస్పీ కృష్ణారావు, జేసీ ప్రశాంతి, వీఆర్వో రాజకుమారి, ఆర్డీవోలు మాధవి, శ్రీకర్, అఖిలతో కలిసి ప్రారంభించారు.

Similar News

News April 12, 2026

GNT: మరోసారి మెరిసిన వెన్నెల జ్యోతి సురేఖ

image

ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-1 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారతజట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అమెరికాపై 233-232తో విజయం సాధించారు. మన తెలుగమ్మాయి వెన్నల జ్యోతి సురేఖ తన సహచర జట్టు క్రీడాకారిణులు మధుర, ప్రగతీలతో కలిసి భారత్ స్వర్ణపతకం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జ్యోతి సురేఖ ప్రపంచ వేదికలపై 12 సార్లు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు.

News April 12, 2026

భద్రాద్రి జిల్లాలో ఆగని రేషన్ బియ్యం దందా

image

జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్న రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 నెలలు రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తూ ఉండటంతో అక్రమార్కులకు రేషన్ దందాకు అవకాశం దొరికింది. ఇటివలే ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు మండలాల్లో రేషన్ బియ్యం అధికారులు పట్టుకున్నారు. అధికారులు పట్టుకుంటున్న మరోవైపు బియ్యం అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

News April 12, 2026

చర్చలు ఫెయిల్ కావడానికి కారణాలు ఇవేనా..?

image

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దీనికి న్యూక్లియర్ డీల్ ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని, భవిష్యత్‍‌లో దానిపై పరిశోధనలు చేయవద్దని అమెరికా సూచించగా ఇరాన్ తలొగ్గలేదు. అలాగే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకూ నో చెప్పింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ కోరగా అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది.