News August 8, 2024

విదేశాల నుంచి తిరిగి వచ్చిన రోజా

image

మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి చేరుకున్నారు. నిండ్ర మండలం జీఎన్ కండ్రిగ, వైఎన్ కండ్రిగ గ్రామాల్లో గురువారం పర్యటించారు. వైఎన్ కండ్రిగకు చెందిన వైసీపీ కార్యకర్త పవన్ అనారోగ్యంతో చికిత్స పొందగా ఆయనను రోజా పరామర్శించారు. అనంతరం GNకండ్రిగకు చెందిన కోనమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని ఓదార్చారు. కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో రోజా విదేశాల్లో ఉన్నారంటూ ఓ ఫొటో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే.

Similar News

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.

News October 22, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.

News October 22, 2025

చిత్తూరులో కంట్రోల్ రూమ్

image

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రజలు వాగులు, వంకల వైపు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని కోరారు. వర్షాలతో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూము నంబర్లు 9491077325, 08572 242777కు కాల్ చేయాలని కోరారు.