News February 28, 2025

విదేశీ పర్యటనలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే

image

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విదేశీ పర్యటనలో చిల్ అవుతున్నారు. చల్లటి మంచు కొండల్లో స్వెటర్ ధరించి కొత్త లుక్‌లో ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అభిమానులు తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో విభిన్నంగా తెలియజేస్తున్నారు. కాగా, ఆయన ఏ దేశంలో పర్యటిస్తున్నారనేది పేర్కొనకపోవడం గమనార్హం.

Similar News

News February 24, 2026

పుట్టపర్తి సివిల్ జడ్జి కోర్టుకు బాంబు బెదిరింపు

image

పుట్టపర్తిలోని సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. కోర్టులో బాంబు ఉందని మెయిల్ రావడంతో డీఎస్పీ విజయ్ కుమార్ రంగంలోకి దిగి మెటల్ డిటెక్టర్లు డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని, నకిలీ మెయిల్ ఐడీలతో కొందరు వ్యవస్థలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు.

News February 24, 2026

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా: దేవ్‌జీ

image

TG: మావోయిస్టు నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి, చొక్కారావు, నర్సింహారెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని దేవ్‌జీ వెల్లడించారు. అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడానన్నారు. మావోయిజం అంతం కాదని, ప్రజా సమస్యలపై పోరాడుతానని రాజిరెడ్డి పేర్కొన్నారు. అజ్ఞాతంలోని 11 మందిలో కొంతమంది తమతో చర్చిస్తున్నారని DGP శివధర్‌రెడ్డి తెలిపారు. గణపతి అడవిలో లేరని తెలిసిందన్నారు.

News February 24, 2026

ఇంటర్ పరీక్షలకు 359 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు 64 పరీక్ష కేంద్రాలలో జరిగినట్లు ఆర్ఐవో రమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,919లో 20,588 మంది హాజరు కాగా 331 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,900 గాను 1,872 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిసి కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామని ఆయన తెలిపారు.