News March 22, 2025

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు

image

ఇతర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చదవాలని అనుకునే వారి కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు శౌర్య కన్సల్టెన్సీ తెలిపింది. ఇందుకోసం JNTU బ్రాంచీలో ఈ నెల 22, 23 తేదీల్లో యూనివర్సిటీ, బ్యాంకు అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటించింది. విద్యార్థులు ఎవాల్యుయేషన్, స్కాలర్‌షిప్ గైడెన్స్, ఇతర వివరాల కోసం ఆయా తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 29, 2025

SCRలో 92 మంది పదవీ విరమణ

image

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న 92 మంది ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. హెడ్‌ క్వార్టర్స్, సికింద్రాబాద్, హైదరాబాద్‌ డివిజన్లతో పాటు లాలాగూడ వర్క్‌షాపులో వీరు విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సహోద్యోగుల ఆధ్వర్యంలో వివిధ రైల్వే కార్యాలయాల్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

News March 29, 2025

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: డీఎంహెచ్‌ఓ

image

30, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ వెంకట్‌ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సహకారంతో సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

News March 29, 2025

OU: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏ లాంగ్వేజెస్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఏ లాంగ్వేజెస్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపరుకు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!