News March 23, 2025
విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.
Similar News
News April 20, 2025
తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News April 20, 2025
ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.