News March 23, 2025
విదేశీ విద్య కోసం ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ అధికారి సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 2024 25 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా 19.05.2025 లోపు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08542-220020 నెంబర్ పై సంప్రదించాలన్నారు. SHARE IT.
Similar News
News November 23, 2025
అంతరిక్ష విజ్ఞాన వీచిక.. స్పేస్ ఆన్ వీల్స్: కలెక్టర్

విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు, ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు స్పేస్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్ను కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. అంతరిక్ష రంగంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.
News November 23, 2025
పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారు: MP కావ్య

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి ఇంటికి వెలుగు చేరేలా, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
News November 23, 2025
గిరిజన దర్బారుకు సకాలంలో హాజరు కావాలి: పీవో రాహుల్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని కోరారు.


