News September 25, 2024
విదేశీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి భేటీ

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవకాశాలపై చర్చించారు. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.
Similar News
News October 30, 2025
VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.


