News September 25, 2024
విదేశీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి భేటీ
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ సంస్థ ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవకాశాలపై చర్చించారు. రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలపై మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.
Similar News
News October 4, 2024
VZM: పైడితల్లి హుండీ ఆదాయం రూ.10.54 లక్షలు
శ్రీ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం గత 29 రోజులకు గాను రూ.10,54,690, బంగారం 125.100 గ్రాములు వచ్చింది. గురువారం రెండు ఆలయాల హుండీలను అమ్మవారి కళ్యాణ మండపంలో లెక్కించారు. వెండి 131 గ్రాములు వచ్చినట్లు ఈవో ప్రసాదరావు తెలిపారు. హుండీ లెక్కింపులో పాత రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. హుండీలో ఇలాంటి నోట్లు వేయకూడదని ఈవో సూచించారు.
News October 4, 2024
VZM: పవన్ ప్రసంగం కోసం LED స్క్రీన్
పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగాన్ని కోట జంక్షన్‌లో గురువారం రాత్రి LED స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించారు. తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన దంపతులు భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, జనసైనికులు, నాయకులు ప్రత్యక్షంగా తిలకించారు.
News October 4, 2024
రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామచంద్రస్వామి వారి ఆస్థాన మండపంలో విష్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనము, యాగశాలలో అజస్ర దీపారాధన, మృత్సంగ్రహణము, అంకురారోపణ కార్యక్రమాలను వైదిక సిబ్బంది నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.