News October 10, 2024

విద్యకు గుమ్మంగా ఖమ్మం జిల్లా: తుమ్మల

image

విద్యకు గుమ్మం ఖమ్మం జిల్లా అని, ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ స్కూల్‌ కాంప్లెక్స్‌ శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Similar News

News December 1, 2025

IELTSకు దరఖాస్తుల ఆహ్వానం: బీసీ స్టడీ సర్కిల్

image

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అంతర్జాతీయ స్కాలర్షిప్ పొందడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News December 1, 2025

మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: తుమ్మల

image

మార్చి 2026 నాటికి ఖమ్మం మున్నేరు రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర్ మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో తుమ్మల సమీక్షించారు. ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని పేర్కొన్నారు.

News December 1, 2025

జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.