News October 10, 2024
విద్యకు గుమ్మంగా ఖమ్మం జిల్లా: తుమ్మల

విద్యకు గుమ్మం ఖమ్మం జిల్లా అని, ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని అధికారులకు మంత్రి సూచించారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.
News November 13, 2025
దానవాయిగూడెం గురుకులంను మోడల్‌గా మారుస్తాం: పొంగులేటి

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.
News November 12, 2025
87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.


