News November 15, 2024
విద్యకు రూ.29,000 కోట్లు కేటాయింపు: విశాఖ ఎంపీ
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ఈ ఏడాది రూ.29,000 కోట్లు కేటాయించడం జరిగిందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. శుక్రవారం ఎన్ఏడి జంక్షన్ వద్ద నూతన విద్య వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య అనేది కేవలం విజయం కోసం కాదని అన్నారు. సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం అన్నారు. అయితే అది డిజిటల్ వైషమ్యాన్ని పెంచకుండా అందరికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
Similar News
News December 7, 2024
పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత
విశాఖ ఆరిలోవలో నిర్మించిన నూతన పోలీసు స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొనున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఈ భవన నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తూ నేటికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు.
News December 7, 2024
పెందుర్తి: మాదకద్రవ్యాలపై పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
News December 7, 2024
విశాఖ నుంచి విమానాల దారి మళ్లింపు
విశాఖలో ఇవాళ పొగ మంచు తీవ్రంగా కురిసింది. ఎయిర్‌పోర్టు ఏరియాలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ రావాల్సిన.. ఇండిగో సంస్థకు చెందిన మూడు విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-వైజాగ్ విమానాలను హైదరాబాద్‌కి మళ్లించారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చే విమానాన్ని భువనేశ్వర్‌లో ల్యాండ్ చేశారు.