News June 20, 2024
విద్యతోనే గిరిజనుల అభివృద్ధి: ఎస్టీ కమిషన్ సభ్యుడు
విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.
Similar News
News September 15, 2024
నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు
నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.
News September 15, 2024
యువకుడిని కాపాడిన నంద్యాల పోలీసులు
నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. వివరాలు.. గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురైన మానస భర్త అశోక్ (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బంధువుల సమాచారం, ఎస్పీ, డీఎస్పీల దిశానిర్దేశంతో ఆపరేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
News September 15, 2024
తుగ్గలి: వజ్రం దొరికింది
ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ.10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.