News March 18, 2025
విద్యతోనే భవిష్యత్తు: ప్రొఫెసర్ కాశీం

లింగాల మండలం అంబటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశీం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు సాగితే ఎవరైనా గొప్ప విజయాలు సాధించగలరన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: ఉద్యోగులకు కోడ్ ఆఫ్ కండక్ట్.. కరచాలనం చేసినా తప్పే!

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అభ్యర్థులతో కరచాలనం చేసినా, అనవసర సాన్నిహిత్యం ప్రదర్శించినా అది ఎన్నికల నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘన అవుతుందని సంఘం హెచ్చరించింది. అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే, అది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే, సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.
News December 8, 2025
‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.


