News February 1, 2025
విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి: జిల్లా జడ్జి

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమని సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డా. సాయి రమాదేవి అన్నారు. చిన్నకోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలోనే విద్యా పాటిష్టంగా ఉండాలన్నారు.
Similar News
News November 12, 2025
నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి
News November 12, 2025
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 12, 2025
ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.


