News March 5, 2025
విద్యార్థినికి నియామక పత్రం అందజేసిన సీఎం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు
Similar News
News March 18, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఫినాయిల్ తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కి చెందిన పెంటయ్య(62) ఆదివారం ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదైంది.
News March 18, 2025
MBNR: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై<<15788272>> ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. NGKL జిల్లా బిజినేపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(76) MBNRలో నివాసముంటున్నారు. ఆయన కూతురు శ్వేత(45), ఈమె కొడుకు నిదయ్‌రెడ్డి(22)లు HYDలో ఉంటున్నారు. వీరు ముగ్గురు కారులో HYD నుంచి జడ్చర్లకు వస్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.
News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.