News February 5, 2025

విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

image

విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్‌ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Similar News

News January 21, 2026

జనగామ మునిసిపాలిటీకి 1953లో తొలి అడుగు!

image

జనగామ మునిసిపాలిటీ 1953లో 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఇది ఆవిర్భవించింది. ఆ సమయంలో 14 వార్డులతో ఉన్న ఈ పురపాలికకు జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోడూరి జగన్నాథ రెడ్డి తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2010లో రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా పదోన్నతి పొందిన జనగామ, మొదటి బడ్జెట్‌ను కేవలం రూ.40 వేలతో ప్రవేశపెట్టడం విశేషం. అప్పట్లో ఛైర్మన్‌కు ఇచ్చే గౌరవ వేతనం రూ.50 మాత్రమే.

News January 21, 2026

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చొప్పదండి ప్రస్థానం

image

కరీంనగర్ జిల్లాలో 1951 నుంచే ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చొప్పదండి, తెలంగాణ రాష్ట్రంలో 2018 ఆగస్టు 2న మేజర్ పంచాయతీ నుంచి పురపాలికగా అవతరించింది. 14 వార్డులతో ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పట్టణ రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వ్యవసాయాధారిత గ్రామమైన చొప్పదండి, నేడు రాజకీయ, వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

News January 21, 2026

ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. 10gలపై రూ.73వేలు లాభం!

image

ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలొచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ.81,230 ఉన్న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు రూ.1,54,800కు చేరి రూ.73,570 లాభాన్ని పంచింది. అలాగే ఈ 3 రోజుల్లోనే రూ.11,020 పెరిగింది. అటు KG వెండి ధర రూ.1,04,000 నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,40,000కు చేరుకుంది. ఈ భారీ లాభాలతో పసిడి, వెండిపై ఇన్వెస్టర్లకు మరింత నమ్మకం ఏర్పడింది.