News January 30, 2025
విద్యార్థినిలకు చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు సమస్యలు ఉంటే వారు సోమవారం కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలో మిషన్ వాత్సల్య పథకం అమలు తీరుపై సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులను వేధించడం, ఈవ్ టీజింగ్ వంటి సమస్యలు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 14, 2025
చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు.
News February 14, 2025
చిత్తూరు: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
తిరుపతి: కిరణ్ రాయల్‌పై కేసు నమోదు

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్‌పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.