News July 26, 2024
విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
Similar News
News December 4, 2025
పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.