News July 27, 2024
విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి
నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.
Similar News
News December 26, 2024
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు
రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నరసింహ యాగం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
News December 26, 2024
REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి
సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.
News December 26, 2024
నెల్లూరు జిల్లాలో చలిగాలులతో వణుకుతున్న ప్రజలు
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో వృద్ధులు పిల్లలతో పాటు సాధారణ ప్రజలు కూడా చలికి గజగజ వణికి పోతున్నారు.