News July 27, 2024

విద్యార్థి మృతిపై మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతి

image

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మ‌ర‌ణించార‌న్న విష‌యం తెలుసుకున్న మంత్రి నారాయ‌ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.

Similar News

News December 12, 2024

దేశ ప్రధానిని కలిసి ఎంపీ వేమిరెడ్డి దంపతులు

image

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు.. ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు.

News December 12, 2024

తిరుపతి జిల్లా విద్యాసంస్థలకు నేడు సెలవు

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి

image

అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.