News May 22, 2024

విద్యార్థి సంఘాలతో ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News October 2, 2024

మెదక్: ప్రజలకు హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు

image

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.

News October 2, 2024

సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు

image

సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News October 2, 2024

MDK: మాంసం విషయంలో తగ్గేదే లేదంటున్నా జనం.!

image

బుధవారం పెత్రమాస అవడంతో ప్రజలు కౌసుపై మక్కువ చూపుతారు. కానీ ఈ సంవత్సరం పెత్రమాసతో పాటు గాంధీ జయంతి రావడంతో అధికారులు జీవహింస చేయరాదని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఉ.4 గంటలకు మటన్ షాపులు ఓపెన్ చేసి మటన్ అమ్మారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉ.3 గంటలకె మేకలు, గొర్రెలను కోశారు. పెద్దలకు నైవేద్యంగా పెట్టే మాంసాన్ని ఆచార సంప్రదాయాన్ని మరువలేమని పలువురు అన్నారు.