News March 14, 2025

విద్యార్థులకు అర్థమయ్యేలా ఏఐతో బోధించండి: కలెక్టర్

image

విద్యార్థులకు అర్థమయ్యేలా AIతో బోధించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తొలి విడతగా 33 పాఠశాలల్లో ఏఐని అమలు చేస్తున్నట్లు చెప్పారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఏఐతో బోధన చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాదిరి పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు గడువు పెంపు

image

సంగారెడ్డి జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 5, 2025

NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

image

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.

News December 5, 2025

భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

image

ఉక్రెయిన్‌-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.