News April 9, 2025
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.
Similar News
News October 27, 2025
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న… పాట రాసింది మన కొసరాజు అన్న

సుప్రసిద్ధ కవి, రచయిత, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజుగా పేరొందిన కొసరాజు రాఘవయ్య (జూన్ 23, 1905-అక్టోబర్ 27, 1986) కర్లపాలెం మండలం చింతాయపాలెంలో జన్మించారు. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఏరువాక సాగారో రన్నో, రామయతండ్రి ఓ రామయ తండ్రి పాటల్లో తన ముద్ర కనిపిస్తుంది. హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినది ఆయనే, ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నారు.
News October 27, 2025
అభయారణ్యంలోకి 29 వరకు సందర్శకుల రాక నిషేధం

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 29 వరకు కోరింగ అభయారణ్యంలోకి సందర్శకుల రాకను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు అధికారి వరప్రసాద్ తెలిపారు. అటు ఇప్పటికే తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాగా.. ఉప్పాడ, కొత్తపల్లి సహా 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. అటు ఈనెల 31 వరకు విద్యార్థులకు హాలిడే ప్రకటించారు.
News October 27, 2025
భూ వినియోగ మార్పిడికి ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు

AP: భూ వినియోగ మార్పులకు (చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు కానున్నాయి. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(DPMS) పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న 45 రోజుల్లోగా అనుమతులిస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యక్తులు ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేసింది.


