News July 4, 2024
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: కలెక్టర్

హాస్టల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.
Similar News
News December 15, 2025
నల్గొండ: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం..!

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు దేవరకొండ డివిజన్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డివిజన్లోని మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 227 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల భవిత్యం తేలనుంది. మొత్తం 2,81,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 15, 2025
మర్రిగూడ: సాఫ్ట్వేర్ to సర్పంచ్

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
News December 15, 2025
NLG: సాఫ్ట్వేర్ TO సర్పంచ్

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.


