News February 18, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అడిషనల్ కలెక్టర్

image

విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కామన్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కృతమూర్తికి ఆయన సూచించారు.

Similar News

News April 10, 2026

పెద్దపల్లి: ‘పుష్కర ఘాట్ల రోడ్లు గడువులోగా పూర్తిచేయాలి’

image

పుష్కరాల ఘాట్లకు వెళ్లే రహదారులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్&బి, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలతో సమీక్ష నిర్వహించారు. మంథని, గోలివాడ ఘాట్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. భారీగా భక్తులు వచ్చే అవకాశముండటంతో శాశ్వత సదుపాయాలు కల్పించాలని తెలిపారు. మంథని ఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News April 10, 2026

ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి గంగాదేవుళ్ల ఆశాంత్ గురువారం రాత్రి మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్కే ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 10, 2026

HYD: జిల్లా కోర్టుల జడ్జీల బదిలీలు, పోస్టింగ్

image

జిల్లా& సెషన్స్ కోర్టుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ సివిల్ జడ్జి 3- శ్రీనివాసరావు ఖమ్మం& సెషన్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. HYD మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి డా.మహేశ్‌నాథ్, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్, అడిషనల్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీనగర్ RR జిల్లా XII డిస్టిక్ & అడిషనల్ సెషన్స్ జడ్జిగా అనిత రానున్నారు.