News February 26, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి: కలెక్టర్

హాస్టల్లో నాణ్యమైన సరుకులతోనే ఆహారం వండి వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనో చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 93 మంది విద్యార్థులు గల ఈ హాస్టల్లోని డార్మెంటరీలో విద్యార్థులు పడుకునేందుకు ఉపయోగిస్తున్న బెడ్లు, పరుపులను పరిశీలించారు.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.